దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,80,926 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ఇందులో 171 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,80,386కి చేరింది.
కరోనా మహమ్మారి దేశంలో మొదలైనప్పటి నుంచి నేటి వరకు ఈ మహమ్మరి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,722కి చేరింది. నిన్న 148 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,41,47,322కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్యతో పోలిస్తే యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా 220.15 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.