దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
India reports new covid 19 cases in last 24 hours.నిన్నటితో పోలిస్తే నేడు దేశంలో కరోనా కేసులు స్వల్పంగా
By తోట వంశీ కుమార్ Published on
17 Jun 2021 4:12 AM GMT

నిన్నటితో పోలిస్తే నేడు దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 19,31,249 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 67,208 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,00,313కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,330 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,81,903 కి పెరిగింది. నిన్న 1,03,570 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,84,91,670 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 8,26,740 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.80శాతానికి పెరిగిందని మంత్రిత్వశాఖ చెప్పింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 26,55,19,251కి చేరింది.
Next Story