స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

India Reports 9923 new corona infections.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గ‌త కొద్ది రోజులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2022 5:05 AM GMT
స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గ‌త కొద్ది రోజులుగా 12 వేల‌కు పైగా న‌మోదైన కొత్త కేసులు నేడు 10 వేల‌కు దిగువ‌కు చేరాయి. నిన్న‌ దేశ వ్యాప్తంగా 3,88,641 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 9,923 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,33,19,396కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,24,890 కి చేరింది.

నిన్న 7,293 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,27,15,193కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 79,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.61 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.55శాతంగా ఉంది. దేశం క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 13,00,024 మందికి క‌రోనా టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి ఇప్పటి వరకు 1,96,32,43,003 డోసులను పంపిణీ చేశారు.

Next Story