దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,00,918 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా..975 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,40,947కి చేరింది. నిన్న కరోనా కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,21,747కి చేరింది.
ఒక్క రోజులో 796 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,07,834కి చేరింది. ప్రస్తుతం దేశంలో 11,366 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.74 నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 6,89,724 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,86,37,52,270 డోసులను పంపిణీ చేశారు.