స్వ‌ల్పంగా త‌గ్గిన కరోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

India Reports 9520 new corona cases.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2022 4:49 AM GMT
స్వ‌ల్పంగా త‌గ్గిన కరోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త‌ త‌గ్గాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3,81,205 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 9,520 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,98,696కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా క‌రోనా కార‌ణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 5,27,597 మంది ప్రాణాలు కోల్పోయారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 12,875 మంది కోలుకోగా.. మొత్తం 4,37,83,788 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. ప్ర‌స్తుతం దేశంలో 87,311 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.62 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.50 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 25,86,805 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 211.39 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story