దేశంలో 949 కేసులు.. 6 మ‌ర‌ణాలు

India Reports 949 new covid 19 infections.దేశంలో గ‌డిచిన 24 గంటల్లో 3,67,213 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా..949

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2022 10:34 AM IST
దేశంలో 949 కేసులు.. 6 మ‌ర‌ణాలు

దేశంలో గ‌డిచిన 24 గంటల్లో 3,67,213 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా..949 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,39,972కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,21,743కి చేరింది.

ఒక్క రోజులో 810 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,07,038కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 11,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76, రోజువారి పాజిటివ్ రేటు 0.26శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 6,66,660 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,86,30,62,546 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story