దేశంలో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

India reports 94052 new covid 19 cases in last 24 hours.దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతున్న‌ప్ప‌టికి మృతుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2021 5:32 AM GMT
దేశంలో క‌రోనా  మ‌ర‌ణ‌మృదంగం.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతున్న‌ప్ప‌టికి మృతుల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. వ‌రుసగా మూడు రోజు కొవిడ్‌ కేసులు లక్షకు దిగువన నమోదు అయిన‌ప్ప‌టికి రికార్డు స్థాయిలో ఒకే రోజు 6,148 మరణాలు నమోదయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 20,04,690 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 94,052 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,83,121 కి చేరింది. నిన్న ఒక్క రోజే 6,148 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇంత పెద్ద మొత్తంలో మ‌ర‌ణాలు న‌మోదు అవ్వ‌డం ఇదే తొలిసారి. బీహార్ రాష్ట్రం మ‌ర‌ణాల లెక్క‌ను స‌వ‌రించ‌డంతో ఈ సంఖ్య‌లో భారీ పెరుగుద‌ల క‌నిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 3,59,676 మంది ఈ మ‌హ‌మ్మారికి బల‌య్యారు. నిన్న 1,51,367 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,76,55,493కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 11,67,952 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రిక‌వ‌రీ రేటు 94.55శాతానికి చేరింది. టీకా డ్రైవ్‌లో23,90,58,360 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.

Next Story
Share it