దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 937 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,61,516కి చేరింది. ఇప్పటి వరకు 4,41,16,492 మంది ఈ మహమ్మారిని జయించారు.
నిన్న కరోనా కారణంగా 9 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,30,509కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14,515 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 219.73 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.