దేశంలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11.66లక్షల కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 93,249 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,85.509కి చేరింది. నిన్న ఒక్క రోజే 513 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి వ్యాప్తి దేశంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,64,623కి చేరింది.
నిన్న ఒక్క రోజే 60,048 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు కోలుకున్నావారి సంఖ్య 1,16,29,289 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,91,597 యాక్టివ్ కేసులున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 27.83లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 7,59,79,651 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇక మహరాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం ఒక్క రోజే 49,447 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29.53లక్షలకు చేరింది. ఇక 277 మంది మృత్యువాత పడగా.. మొత్తంగా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 55,656 కిచేరింది. నిన్న ఒక్క రోజే 37,821 మంది కోలుకున్నారు.