అదుపులోనే క‌రోనా.. ఢిల్లీలో మాత్రం ఆందోళ‌న క‌రం..!

India Reports 9062 new covid-19 cases.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 3,64,038

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2022 11:20 AM IST
అదుపులోనే క‌రోనా.. ఢిల్లీలో మాత్రం ఆందోళ‌న క‌రం..!

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 3,64,038 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 9,062 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వీటితో క‌లుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,42,86,256కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 36 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 5,27,134 మంది ప్రాణాలు కోల్పోయారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో 15,220 మంది కోలుకోగా.. మొత్తం 4,36,54,064 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. ప్ర‌స్తుతం దేశంలో 1,05,058 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.57 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.49 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 25,90,557 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 208.57 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి అదుపులోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఒక్క ఢిల్లీలో మాత్రం ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగా ఉంది. అక్క‌డ పాజిటివీ రేటు 20 శాతం చేరువైంది. దీంతో యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. 5,387 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌గా.. 563 మంది ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్ప‌త్రిలో చేరిన వారిలో దాదాపు 90 శాతం మంది బూస్ట‌ర్ డోస్ తీసుకోలేద‌ని డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా తెలిపారు.

Next Story