భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు.. 33 శాతం అధికం

India reports 8822 new covid-19 infections.దేశంలో క‌రోనా రోజువారి కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. త‌గ్గిన‌ట్లే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2022 10:18 AM IST
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు.. 33 శాతం అధికం

దేశంలో క‌రోనా రోజువారి కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు 33.7శాతం అధికంగా న‌మోదుఅయ్యాయి. నిన్న‌ దేశ వ్యాప్తంగా 4,40,278 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 8822 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,45,517 కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,24,792 కి చేరింది.

నిన్న5,718 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,26,67,088కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 53,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.66 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 13.58ల‌క్ష‌ల మందికి టీకా వేయ‌గా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,95,50,87,271 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story