భారీగా త‌గ్గిన కేసులు..కొత్త‌గా ఎన్నంటే..?

India Reports 8813 new covid-19 cases.దేశంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతోంది. రోజు వారీ కేసుల సంఖ్య 8 వేల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Aug 2022 4:57 AM GMT
భారీగా త‌గ్గిన కేసులు..కొత్త‌గా ఎన్నంటే..?

దేశంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతోంది. రోజు వారీ కేసుల సంఖ్య 8 వేల‌కు దిగొచ్చింది. నిన్న దేశ వ్యాప్తంగా 2,12,129 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 8,813 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వీటితో క‌లుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,42,77,194కి చేరింది. తాజాగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 5,27,098 మంది మ‌ర‌ణించారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో 15,040 మంది కోలుకోగా.. మొత్తం 4,36,38,844 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. ప్ర‌స్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.56 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.15 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 6,10,863 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 208.31 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story