దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 3,91,281 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 8586 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,43,57,546కి చేరింది. గడిచిన 24 గంటల్లో 48 మంది చనిపోయారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 5,27,416 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 9,650 మంది కోలుకోగా.. మొత్తం 4,37,33,624 మంది ఈ మహమ్మారిని జయించారు. ప్రస్తుతం దేశంలో 96,506 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.59 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.19 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 29,25,342 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 210.31 కోట్ల డోసులను పంపిణీ చేశారు.