మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

India reports 8329 new covid-19 infections.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క్ర‌మంగా విస్త‌రిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2022 10:14 AM IST
మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క్ర‌మంగా విస్త‌రిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 3,44,994 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 8,329 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,13,435 కి చేరింది. 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 10 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,757కి చేరింది.

నిన్న 4,216 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,26,48,308కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 40,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.69 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.41శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న15.08ల‌క్ష‌ల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,94,92,71,111 మందికి డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story