భార‌త్ కరోనా అప్‌డేట్‌.. త‌గ్గిన కేసులు

India Reports 8318 Corona Positive cases today.భార‌త్‌లో రోజువారి కేసుల సంఖ్య‌లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Nov 2021 10:21 AM IST
భార‌త్ కరోనా అప్‌డేట్‌.. త‌గ్గిన కేసులు

భార‌త్‌లో రోజువారి కేసుల సంఖ్య‌లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 9,69,354 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 8,318 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,45,63,749కి చేరింది. నిన్న ఒక్క రోజే 465 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,67,933కి చేరింది.

నిన్న 10,967 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,39,88,797కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,07,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.34 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న 73ల‌క్ష‌ల మందికి క‌రోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 121 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.

Next Story