త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

India Reports 796 new covid 19 infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 4,06,251 మందికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2022 10:08 AM IST
త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 4,06,251 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 796 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,36,928కి చేరింది. నిన్న 19 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,21,710కి చేరింది.

ఒక్క రోజులో 946 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,04,329కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 10,889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76, రోజువారి పాజిటివ్ రేటు 0.20శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 185.90కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story