భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

India reports 795 new corona infections.దేశంలో క‌రోనా వైర‌స్ పూర్తిగా అదుపులోకి వ‌స్తోంది. గ‌డిచిన 24 గంటల్లో 4,66,332

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2022 10:15 AM IST
భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

దేశంలో క‌రోనా వైర‌స్ పూర్తిగా అదుపులోకి వ‌స్తోంది. గ‌డిచిన 24 గంటల్లో 4,66,332 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 795 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,29,839కి చేరింది. నిన్న 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 5,21,416కి చేరింది.

ఒక్క రోజులో 1,280 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,24,96,369కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 12,054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.17 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 16 ల‌క్ష‌ల మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,84,87,33,081 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story