దేశంలో పెరుగుతున్న కేసులు.. కొత్త‌గా 7,584 మందికి పాజిటివ్‌

India Reports 7584 new Covid-19 infections.దేశంలో క్ర‌మంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2022 4:35 AM GMT
దేశంలో పెరుగుతున్న కేసులు.. కొత్త‌గా 7,584 మందికి పాజిటివ్‌

దేశంలో క్ర‌మంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 3,35,050 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 7,584 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,05,106 కి చేరింది. 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 24 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,747 కి చేరింది.

నిన్న 3,791 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,26,44,092కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 36,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.70 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.26శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న16,61,301 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,94,76,42,992 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story