దేశంలో క‌రోనా వ్యాప్తి ఎలా ఉందంటే..?

India Reports 6298 new covid-19 cases.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అదుపులోనే ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sep 2022 4:59 AM GMT
దేశంలో క‌రోనా వ్యాప్తి ఎలా ఉందంటే..?

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 3,33,964 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 6,298 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,16,355కి చేరింది. నిన్న 5,916 మంది కోలుకోగా.. మొత్తం 4,39,47,756 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. నిన్న 23 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,28,239 కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 46,748 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.71 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.89 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 19,61,896 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 216.17 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story