దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా 62వేలు

India reports 62258 New corona cases.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2021 5:11 AM GMT
దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా 62వేలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 62,258 క‌రోనా పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 1,19,08,910కి చేరింది. నిన్న 291 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 1,61,240కి చేరింది. ఒక్క రోజులో 30,386 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 1,12,95,023కి చేరింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 4,52,647 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆరేటు 3.55శాతానికి పెరిగింది. దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,97,69,553 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

ఇక మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో 36,902 కొత్త‌గా పాజిటివ్ కేసులు నిర్ణార‌ణ కాగా.. 112 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2.83ల‌క్ష‌ల‌కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 26ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోక‌గా.. సుమారు 23ల‌క్ష‌ల మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌ట్టారు. క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో ఆదివారం రాత్రి నుంచి ఆ రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూను విధించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 26,05,333 డోసుల‌ను పంపిణీ చేయ‌గా.. మొత్తంగా 5,81,09,773మందికి టీకాలు అందించింది.




Next Story