దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

India reports 59,118 new corona virus cases.దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 11,00,756 క‌రోనా శాంపిల్ల‌ను ప‌రీక్షించ‌గా.. 59,118 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2021 6:34 AM GMT
India reports 59,118 new corona virus cases

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉగ్ర‌రూపం దాల్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 11,00,756 క‌రోనా శాంపిల్ల‌ను ప‌రీక్షించ‌గా.. 59,118 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,46,652కి చేరింది. నిన్న ఒక్క‌రోజే 257 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,60,949కి చేరింది. కాగా.. నిన్న ఒక్క రోజే 32,987 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 1,12,64,637 కి చేరింది. ఇక యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. ప్రస్తుతం 4లక్షల 21వేల 066 యాక్టివ్ కేసులుండగా..ఆ రేటు 3.55 శాతానికి చేరింది. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 23,86,04,638 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

దేశంలో కరోనా విజృంభణలో మహారాష్ట్ర వాటానే అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో తాజాగా 35వేల 952 కొత్త కేసులు వెలుగుచూడగా..111 మంది కరోనాకు బలయ్యారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 4.21లక్షల యాక్టివ్ కేసులుండగా..ఒక్క మహారాష్ట్రలోనే వాటి సంఖ్య 2,64,001గా ఉంది. అక్కడ మొత్తం పాజిటివ్ కేసులు 26లక్షలకు పైబడగా.. 22,83,037 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే.. క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. మార్చి 25న కేంద్రం 23,58,731 టీకా డోసుల‌ను పంపిణీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 5,55,04,440 మందికి టీకాలు అందించింది.


Next Story