దేశంలో కొత్త‌గా 5వేల కేసులు.. 18 మ‌ర‌ణాలు

India Reports 5554new corona cases.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది.నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య త‌గ్గాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Sep 2022 5:07 AM GMT
దేశంలో కొత్త‌గా 5వేల కేసులు.. 18 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3.76 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 5,554 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,90,283కి చేరింది. నిన్న 6,322 మంది కోలుకోగా.. మొత్తం 4,39,13,294 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. నిన్న 16 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,28,139 కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 48,850 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.7 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.47 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 21,63,811 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 214.77 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story