స్వ‌ల్పంగా పెరిగిన కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

India Reports 5443 new covid-19 cases.రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2022 6:02 AM GMT
స్వ‌ల్పంగా పెరిగిన కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 3,39,062 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 5,443 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 5,291 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,39,78,271 మందికి చేరింది. నిన్న 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,28,429 కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 46,342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.71 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.61 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 15,85,343 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 217.11 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story
Share it