దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,20,187 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 5,383 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్న 6,424 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,39,84,695 మందికి చేరింది. నిన్న 20 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,449 కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 45,281 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.71 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.68 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 14,91,017 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 217.26 కోట్ల డోసులను పంపిణీ చేశారు.