పెరిగిన కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

India Reports 5379 new corona cases.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sep 2022 5:02 AM GMT
పెరిగిన కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య 10 వేల లోపే న‌మోదు అవుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3,21,917 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 5379 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,72,241కి చేరింది. నిన్న 7,094 మంది కోలుకోగా.. మొత్తం 4,38,93,590 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. నిన్న 16 మంది మ‌ర‌ణించగా మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,057కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 50,594 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.7 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.67 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 18,81,319 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 213.91 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story