దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. 93 రోజుల త‌రువాత ఇదే తొలిసారి

India Reports 5233 new covid-19 infections.దేశంలో రోజు వారి క‌రోనా కేసులు భారీగా పెరిగాయి.నిన్న‌ దేశ వ్యాప్తంగా 3,13,361

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2022 10:33 AM IST
దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. 93 రోజుల త‌రువాత ఇదే తొలిసారి

దేశంలో రోజు వారి క‌రోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్న‌ దేశ వ్యాప్తంగా 3,13,361 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 5,233 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,90,282 కి చేరింది. 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 7గురు మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,715 కి చేరింది.

నిన్న 3,345 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,26,36,710కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 28,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.72 గా, రోజు వారి పాజిటివ్ రేటు 1.67గా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న14,94,086 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,94,43,26,416 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story