దేశంలో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,39,994 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 4,510 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్న 5,640 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,39,72,980 మందికి చేరింది. నిన్న 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,28,403 కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 46,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.71 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.33 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 12,27,054 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 216.95 కోట్ల డోసులను పంపిణీ చేశారు.