కరోనా అప్‌డేట్.. భారత్‌లో పెరుగుతున్న కేసులు
India reports 41806 new covid-19 cases in last 24 hours.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే
By తోట వంశీ కుమార్ Published on 15 July 2021 4:42 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల్లో 19,43,488 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 41,806 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,87,880కి చేరింది. నిన్న ఒక్క రోజే 581 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,11,989 కి పెరిగింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) July 15, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/sHar6ykU7f pic.twitter.com/Zz1UWfQnGj
నిన్న 39,130 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,01,43,850 చేరింది. ప్రస్తుతం దేశంలో 4,32,041 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.28శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.21శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.15శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 34,97,058 లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 39,13,40,491కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.