దేశంలో కరోనా మహ్మమారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా నిత్యం లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన 24 గంటల్లో 18,26,490 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 4,14,188 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,91,598 కి చేరినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్క రోజే 3,915 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,34,083కి పెరిగింది.
నిన్న 3,31,507 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,76,12,351కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 36,45,164 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 62,194 కేసులు ఉండగా, కర్ణాటకలో 49,058, కేరళలో 42,464 చొప్పున ఉన్నాయి. ఇక నిన్న మహారాష్ట్రలో 853 మంది మృతిచెందగా, ఉత్తరప్రదేశ్‌లో 350, ఢిల్లీలో 335 మంది బాధితులు చనిపోయారు. ఇప్పటి వరకు దేశంలో 16,49,73,058 టీకాలు పంపిణీ చేశారు.