దేశంలో కాస్త త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

India reports 40715 new corona cases.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిచ్చే కొత్త కేసులు 13శాతం మేర త‌గ్గాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2021 11:08 AM IST
India reports 40715 new corona cases

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. అయితే.. నిన్న‌టితో పోలిచ్చే కొత్త కేసులు 13శాతం మేర త‌గ్గాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో 40,715 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. నిన్న 199 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్ప‌టి వ‌రకు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 1,60,166కి చేరింది. కొత్తగా 29,785 మంది కోలుకోగా.. మొత్తంగా 1,11,81,253 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 3,45,377 ఉన్నాయని చెప్పింది.

వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 4,84,94,594 డోసులు వేసినట్లు వివరించింది. మరో వైపు వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒకే రోజు 9,67,459 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 23,54,13,233 శాంపిల్స్‌ పరీక్షించినట్లు పేర్కొంది. మ‌రో వైపు మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ఉద్దృతి కొన‌సాగుతోంది. తాజాగా 24,645 కేసులు న‌మోదు అయ్యాయి. 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు 22,34,330 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. 2,16,540 మంది ఈ మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతున్నారు.


Next Story