దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,25,379 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 4,041 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,68,585 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 10 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,651 కి చేరింది.
నిన్న 2,363 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,22,757కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.74 గా, రోజు వారి పాజిటివ్ రేటు 0.95గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న12.05 లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 193.83కోట్ల డోసులను పంపిణీ చేశారు.