దేశంలో కొత్తగా 3962 కేసులు.. ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
India Reports 3962 new covid-19 infections.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారి కేసుల్లో
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2022 5:17 AM GMTదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న దేశ వ్యాప్తంగా 4,45,814 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 3,962 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,72,547 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,677 కి చేరింది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) June 4, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/Xuskl40Pj8 pic.twitter.com/l3GovpsigR
నిన్న 2,697 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,25,454కి చేరింది. ప్రస్తుతం దేశంలో 22,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.73 గా, రోజు వారి పాజిటివ్ రేటు 0.89గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న11,67,037 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,96,47,071 డోసులను పంపిణీ చేశారు.
ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు గుర్తించింది. ఈ మేరకు ఆ ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాసింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కరోనా మహమ్మారిపై తీవ్ర పోరాటం సాగించి సాధించిన ఫలితాలను వృథా చేయరాదని, ఆ ఆధిక్యతను నిలుపుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యాప్తి మరింత ఉద్ధృతం కాకుండా కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తమ లేఖలో పేర్కొన్నారు.