భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో 14,63,593 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 38,164 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,44,229కి చేరింది. నిన్న ఒక్క రోజే 499 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,14,108 కి పెరిగింది.
నిన్న38,660 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,03,08,456 చేరింది. ప్రస్తుతం దేశంలో 4,21,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.32శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.08శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 13.63 లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 40.64 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.