దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,95,416 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 3,805 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్న 5,069మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,40,24,164 మందికి చేరింది. నిన్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు.దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,28,655కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 38,293 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.73 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.29 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 16,29,137 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 218.68 కోట్ల డోసులను పంపిణీ చేశారు.