దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3,07,716 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 3,714 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,85,049 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,708 కి చేరింది.
నిన్న 2,513 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,33,365కి చేరింది. ప్రస్తుతం దేశంలో 26,976 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.72 గా, రోజు వారి పాజిటివ్ రేటు 1.21గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న13,96,169మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 194.27 కోట్ల డోసులను పంపిణీ చేశారు.