దేశంలో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. నిన్న దేశ వ్యాప్తంగా 4,41,989 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 3,712 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,64,544 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 5 గురు మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,641 కి చేరింది.
నిన్న 2,584 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,20,394కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.74 గా, రోజు వారి పాజిటివ్ రేటు 0.84గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న12.4 లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 193.70కోట్ల డోసులను పంపిణీ చేశారు.