భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారి కేసులు 3.5లక్షలపైగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,63,742 కరోనా శాంపిల్లను పరీక్షించగా.. కొత్తగా 3,57,229 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,449 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 2,22,408కి చేరింది. నిన్న 3,20,289 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,66,13,292 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రెండు కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో అమెరికా తర్వాత భారత్‌లోనే రెండు కోట్ల కేసులు నమోదయ్యాయి.