దేశంలో కొత్తగా 3545 కేసులు.. 27 మరణాలు
India reports 3545 new covid-19 infections.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య
By తోట వంశీ కుమార్
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 4,65,918 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 3,545 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,94,938 కి చేరింది. నిన్న కరోనా కారణంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) May 6, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/xjc0qimnv4 pic.twitter.com/RBGgF7A3CC
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,002కి చేరింది. గత 24 గంటల్లో 3,549 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,51,248కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,688 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.74 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.76గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 16,59,843 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,89,81,52,695 డోసులను పంపిణీ చేశారు.
ఇక కొత్తగా నమోదు అయిన కేసుల్లో ఐదు రాష్ట్రాల్లోనే 79.82 శాతం కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 1,365, హర్యానాలో 534, ఉత్తరప్రదేశ్‌లో 356, కేరళ 342, మహారాష్ట్రలో 233 కేసులు నమోదు అయ్యాయి.