దేశంలో కొత్త‌గా 3451 కేసులు.. 40 మ‌ర‌ణాలు

India reports 3451 new covid-19 infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2022 11:07 AM IST
దేశంలో కొత్త‌గా 3451 కేసులు.. 40 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంటల్లో3,60,613 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 3,451 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,02,194 కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,064కి చేరింది.

గ‌త 24 గంట‌ల్లో 3,079 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,57,495కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 20,635 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.74 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.96గా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 17,39,403 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,90,20,07,487 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story