దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,73,635 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 3,377 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,72,176కి చేరింది. నిన్న కరోనా కారణంగా 60 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,23,753కి చేరింది.
గత 24 గంటల్లో 2,496 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,30,622కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,801 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.74 గా, రోజువారి పాజిటివిటీ రేటు 0.71గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 22,80,743 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,88,65,46,894 డోసులను పంపిణీ చేశారు.