భారత్‌లో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,64,127 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 3,364 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్న 4,206 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,40,28,370 మందికి చేరింది. నిన్న 18 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,673కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 37,444 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.73 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.28 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 6,90,194 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 218.75 కోట్ల డోసులను పంపిణీ చేశారు.