లా యూనివర్సిటీలో కరోనా కలకలం.. దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు
India Reports 3275 new covid-19 infections.భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య
By తోట వంశీ కుమార్
భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 4,23,430 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 3,275 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,91,393 కి చేరింది. నిన్న కరోనా కారణంగా 55 మంది మరణించారు.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) May 5, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/ZHaZYXHf8F pic.twitter.com/YGEERGZsx9
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,23,975కి చేరింది. గత 24 గంటల్లో 3,010 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,47,699కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.74 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.77గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 13,98,710 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,89,63,30,362 డోసులను పంపిణీ చేశారు.
ఇదిలా ఉంటే.. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన రాజీవ్‌గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా(ఆర్‌జీఎన్‌యూఎల్)లో కరోనా కలకలం రేగింది. అక్కడ 60 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు యూనివర్సిటీని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. వారిలో స్వల్పలక్షణాలు ఉన్నాయిన, ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు.