నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికి కరోనా ఉద్దృతి మాత్రం ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో 16,93,093 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 3,26,098 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,43,72,907కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,890 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,66,207కి చేరింది.
నిన్న 3,53,299 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,04,32,898కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 36,73,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 83.50శాతంగా ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. నిన్న 11,03,625 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 18,04,57,579 మందికి టీకా అందింది.