దేశంలో కొత్త‌గా 2841 కేసులు.. మ‌ర‌ణాలు ఎన్నంటే

India reports 2841 new covid-19 infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 4,86,628 క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2022 10:09 AM IST
దేశంలో కొత్త‌గా 2841 కేసులు.. మ‌ర‌ణాలు ఎన్నంటే

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 4,86,628 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,841 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,16,254 కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,190కి చేరింది.

గ‌త 24 గంట‌ల్లో 3,295 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,73,460 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 18,604 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.74 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.58గా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 14.03 ల‌క్ష‌ల మందికి క‌రోనా టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 190.99 కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story