దేశంలో కొత్త‌గా 2,827 కేసులు.. 24 మ‌ర‌ణాలు

India Reports 2827 new covid-19 infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 4,71,276 క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 May 2022 10:37 AM IST
దేశంలో కొత్త‌గా 2,827 కేసులు.. 24 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 4,71,276 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,827 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,13,413 కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా 24 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,181కి చేరింది.

గ‌త 24 గంట‌ల్లో 3,230 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,70,165 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.74 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.60గా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 14,85,292 మందికి క‌రోనా టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,90,83,96,788 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story