స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

India Reports 2756 new covid-19 cases.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2022 5:01 AM GMT
స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,39,546 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 2,756 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,12,013కి చేరింది. నిన్న 3,393 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 4,40,54,621 ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. నిన్న21 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,799 కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 28,593 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.75 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.15 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 4,73,682 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 218.97 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story