దేశంలో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,55,314 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,745 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,60,832 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 6 గురు మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,636 కి చేరింది.
నిన్న 2,236 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,17,810కి చేరింది. ప్రస్తుతం దేశంలో 18,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.74 గా, రోజు వారి పాజిటివ్ రేటు 0.60గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న10.9లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,57,20,807 డోసులను పంపిణీ చేశారు.