దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే.

India Reports 2593 new covid 19 infections.దేశంలో రోజువారి కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2022 4:39 AM GMT
దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే.

దేశంలో రోజువారి కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. గ‌డిచిన 24 గంటల్లో 4,36,532 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,593 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,57,545కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా 44 మంది మ‌ర‌ణించారు.

దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,22,193కి చేరింది. ఒక్క రోజులో 1,755 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,19,479కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 15,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.75 గా, పాజిటివిటీ రేటు 0.54గా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 19,05,374 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,87,67,20,318 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story