భారత్‌లో రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 4,55,179 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,527 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,54,952కి చేరింది. నిన్న కరోనా కారణంగా 33 మంది మరణించారు.
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,22,149కి చేరింది. ఒక్క రోజులో 1,656 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,17,124కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,079 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75 గా, పాజిటివిటీ రేటు 0.56గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 19,13,296 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,87,46,72,536 డోసులను పంపిణీ చేశారు.