భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

India Reports 2430 new covid-19 cases.దేశంలో క‌రోనా రోజువారి కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Oct 2022 5:17 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

దేశంలో క‌రోనా రోజువారి కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,41,707 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 2,430 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 2,378 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,70,935. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,874కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 26,618 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.01 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 5,82,775 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.27 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story